సమాచార హక్కు చట్టం ఆయుధం లాంటిది..
కోస్గి (ఆంధ్రప్రభ) : రైతులు ప్రతి ఒక్కరూ పంట నమోదును తప్పనిసరిగా చేయించాలని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) జాన్ సుధాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు గుండుమల్లోని రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా జాన్ సుధాకర్ సమాచార హక్కు చట్టం (R.T.I.) గురించి రైతులకు వివరించారు. ఈ చట్టం ఆయుధం లాంటిదని పేర్కొంటూ, దీని ద్వారా రైతులు తగిన సమాచారాన్ని పొంది, ప్రజాసేవలో పారదర్శకతను పెంచవచ్చని తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు R.T.I. దోహదపడుతుందన్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు విధానం, అప్పీల్ ప్రక్రియ, కాల పరిమితి వంటి వివరాలను ఆయన రైతులకు క్షుణ్ణంగా వివరించారు.
పంటల యాజమాన్యంపై సూచనలు..
పంట నమోదుతో పాటు, రైతులు పాటించాల్సిన ఇతర అంశాలపై కూడా DAO సూచనలు చేశారు. ఋతుపరమైన పరిస్థితులు, పురుగులు, తెగుళ్ల నియంత్రణ, కాటన్ కప్పాస్ యాప్ వినియోగం, పత్తి కొనుగోలు వంటి అంశాలపై రైతులకు తగు మార్గదర్శకాలను అందించారు.
ఈ కార్యక్రమంలో కోస్గి డివిజన్ అధికారి రామకృష్ణ, గుండుమల్ వ్యవసాయ అధికారి హర్షతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
