ఆదివాసీల ఆందోళ‌న‌

ఆదివాసీల ఆందోళ‌న‌

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆదివాసీలపై ఫారెస్టు అధికారులు (Forest officials) అక్రమంగా కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని ఆదివారం దండేపల్లి మండలంలోని తాళ్లాపేట అటవీ రేంజ్ కార్యాలయం (Forest Range Office) ఎదుట‌ దమ్మన్నపేట, మామిడిగూడెం గ్రామాలకు చెందిన ఆదివాసీ నాయకులు మహిళలు ఆందోళ‌న‌కు గిగారు. కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, గిరిజనులు (tribals) అని చూడకుండా అటవీశాఖ అధికారులు వేధించడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే త‌మ‌పై అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తట్ర అర్జున్, సాదం బాపు, పెగ్గే శంకర్, కస్తూరి విష్ణు, ఆరే దుబ్బరాజం, కల్లెడ బాలు, మోడితే మహేష్, జైనేని రాజేందర్ పాల్గొన్నారు.

Leave a Reply