ఎమ్మెల్యే కూన ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యే కూన ప్రత్యేక పూజలు

(ఆముదాలవలస, ఆంధ్రప్రభభ): పాలపొలమ్మ తల్లిని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.

పాలపోలమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని తెలిపారు.

Leave a Reply