స్వ‌ర్ణ‌గిరిలో శ‌ర‌న్న‌వ‌రాత్రులు

స్వ‌ర్ణ‌గిరిలో శ‌ర‌న్న‌వ‌రాత్రులు

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : స్వ‌ర్ణ‌గిరి (Swarnagiri) లో శ‌ర‌న్న‌వ‌రాత్రులు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఎనిమిదో రోజైన పద్మావతి అమ్మవారిని పాలు, పెరుగు వంటి విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. అమ్మవారిని రాజ్యలక్ష్మిగా అలంకరించి ఆలయంలోని లక్ష్మి మండపంలో కొలువుదీర్చి అమ్మవారికి బిల్వదళాలతో అర్చన చేశారు. వేంకటేశ్వర స్వామి (Venkateswara Swami) వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. రాజ్యలక్ష్మి (Rajyalakshmi) అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ కార్య‌క్ర‌మం నిర్వహించారు. వేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.


యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి (Venkateswara Swami) ప‌విత్రోత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌తిష్ఠా జ‌రిగి 20 నెలలు పూర్తి కావస్తుందని, ఈ సంద‌ర్భంగా మూడో తేదీ నుంచి ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మానేపల్లి మురళీకృష్ణ, గోపి కృష్ణ లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని వారు కోరారు.

Leave a Reply