అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌

అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌

మేడ్చ‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మేడ్చల్ జిల్లా (Medchal District) కుత్బుల్లాపూర్ (Qutbullahpur) మండల పరిధి గాజులరామారం (Gajularamaram) అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను హైడ్రా (Hydra) తొల‌గిస్తుంది. స‌ర్వే నెంబ‌రు 307 ఎస్ఎఫ్‌సీ స్థ‌లంలో ఉన్న అక్ర‌మ నిర్మాణాలను ( illegal constructions) తొల‌గింపు కోసం ఈ రోజు ఉద‌యం సుమారు ఐదు వంద‌ల మంది పోలీసుల‌ను గాజుల‌రామారం మోహ‌రించారు. ప్రభుత్వ స్థ‌లంలో ఉన్న మూడు వంద‌ల‌కు పైగా ఇళ్ల‌కు కూల్చివేత‌కు హైడ్రా చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితి చోటు చేసుకుంది.

క‌మిష‌న‌ర్ రంగనాథ్ మాట‌ల్లో..

  • గాజుల‌రామారంలో పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా తొలగించట్లేదు. వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, గదులు నిర్మించిన వాటిని తొలగిస్తాం. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుని కంచె ఏర్పాటు చేస్తాం. రూ.13 వేల కోట్ల విలువైన 275 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకుంటాం.
  • గాజుల రామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినవారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు. ఆరు నెలల్లో ఐదుసార్లు స్థానికులతో హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడారన్నారు. కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు.

Leave a Reply