ఉల్లి రైతును ఆదుకుంటాం

  • పక్వానికి వచ్చిన ఉల్లినే తీసుకురండి
  • ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ బి.నవ్య

(ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో) : ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పక్వానికి వచ్చిన ఉల్లిని గ్రేడింగ్ చేసి రైతులు (Farmer) మార్కెట్ కి తీసుకు రావాలని, ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ బి.నవ్య (In-charge Collector Dr.B.Navya) అన్నారు. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ లో ఉల్లి క్రయ విక్రయాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ… కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి స్టాక్ పాయింట్ ఎక్కువగా ఉన్నందున రెండు రోజులు తాత్కాలికంగా ఎమ్మిగనూరు (Emmiganur) మార్కెట్ యార్డ్ లో ఉల్లి క్రయ విక్రయాల నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ కు 18మంది రైతులు 1500 క్వింటాలు పైగా ఉల్లిని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారని ఆమె తెలిపారు.

రైతులు పక్వానికి, వచ్చిన ఉల్లిని మాత్రమే గ్రేడింగ్ చేసి మార్కెట్ కి తీసుకుని రావాలని సూచించారు. రైతులు (Farmers) ఉల్లి పంట నాటిన 110 రోజుల తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత కోత కోయాలని తక్కువ రోజుల్లో పంట కోత కోయడంతో పంట సరిగ్గా ఉండదని, గిట్టుబాటు ధర సమస్యలు వస్తాయని ఇంచార్జ్ కలెక్టర్ వివరించారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. పంటకాలం పూర్తయిన వాటినే కోత కోయాలని సూచించారు. రైతులు తప్పనిసరిగా ఉల్లిని ఆరబెట్టి, గ్రేడింగ్ చేసి మార్కెట్ యార్డుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply