వాగులో మునిగాడు..
మహా ముత్తారం, ఆంధ్రప్రభ : మండలంలోని నల్లగుంట మీనాజీపేట(Meenajipet) సమీపంలో గల వాగులో ఒక మృతదేహం లభ్యమయింది. ఆదివారం గ్రామానికి చెందిన కొంతమంది చేపల వేటకు(for fishing) వెళ్లారు.
దీంతో వాగులోని చెట్ల పొదల మధ్య మృతదేహం లభించినట్లు గ్రామస్తులకు పోలీసులకు తెలిపారు. గత నెల 16న గ్రామానికి చెందిన సింగిని వేణి పోచయ్య అనే వ్యక్తి తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు మహ ముత్తారం పోలీస్ స్టేషన్లో(at the police station) ఫిర్యాదు చేశారు.
అప్పటినుండి కుటుంబ సభ్యులు పలు గ్రామాల్లో బంధువుల ఇండ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. మృతదేహం మీద ఉన్నబట్టల ఆధారంగా పోచయ్యని ఒక నిర్ధారణకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు(family members), పోలీసులు తెలిపారు. పోలీసులు వాగులో నుండి శవాన్నితీసి పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం పంపనున్నట్లు తెలిసింది.

