కొడుకుకు విషమిచ్చి తానూ తాగి..

కాకినాడ, ఆంధ్ర‌ప్ర‌భ‌ : భర్త లేని లోకంలో నేనుండ‌లేన‌ని త‌న కొడుకుకు విషమిచ్చి తానూ తాగి మ‌ర‌ణించిన (Death) విషాద ఘ‌ట‌న కాకినాడ జిల్లా (Kakinada District) సర్పవరం (Sarpavaram) గాంధీనగర్ (Gandhinagar)లో చోటుచేసుకుంది. జనపల్లి గోపి, ఆకాంక్ష (25) దంప‌తుల‌కు ఒక కుమారుడు సార్విక్(2) ఉన్నాడు. కొడుకు పుట్టినరోజు (Birthday) వేడుక కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చ‌లేక జులై 22న గోపి ఆత్మహత్య చేసుకున్నాడు. భ‌ర్త మ‌ర‌ణాన్ని భరించలేక‌పోయిన ఆకాంక్ష గత నెల 31న తన కొడుకుకి పురుగుల మందు ఇచ్చి, తానూ తాగింది. బుధవారం కాకినాడ జీజీహెచ్ (GGH)లో తల్లీకొడుకు మరణించారు.

Leave a Reply