గంజాయి సాగు..

- ఎక్కడంటే.. ఆదిలాబాద్ ఏజెన్సీలోనే!
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : పంటల సాగు మాటున గంజాయి (Ganja) సాగు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 12.4 కిలోల ఉన్న 95 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.9.5 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) తెలిపారు.
సుంగాపూర్‌లో…
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా నార్నూరు మండలం సుంగాపూర్ శివారులో కడప మోతీరాం అనే వ్యక్తి సాధారణ పంటలతోపాటు గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ పోలీసు బృందాలు సోదాలు చేసి గుర్తించారు. ఈ మేరకు నార్నూర్ పోలీసులు (Narnur Police) కేసు నమోదు చేశారు. నిందితుడు కడప మోతీరాంను పోలీసులు అరెస్టు చేశారు.
