MDK | మైనంపల్లిని నిద్ర లేపితే.. బావా బావమరిదికి చుక్క‌లు చూపిస్తా..

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ (BRS) దుకాణం బంద్ అయ్యిందని, మైనంపల్లిని నిద్ర లేపితే బావా బావమరిదికి చుక్కలు చూపిస్తాన‌ని మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) లను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో చందన బ్రదర్స్ (Chandana Brothers) నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. టిఆర్ఎస్ బంద్ చేసి బిఆర్ఎస్ ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ ను వీడి సర్పంచ్ లు, ఎంపిటిసిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈనెల 19న గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, మైనంపల్లిని నిద్ర లేపితే ఎలా ఉంటదో బావా బావమరిదికి చూపిస్తాన‌ని చెప్పారు.

మైనంపల్లిని ఎదుర్కోవాలంటే ఫీల్డ్ లోకి రావాలన్నారు. కులం మతం.ఫీలింగ్ తమకు లేదని, పిచ్చి పిచ్చిగా చేస్తే ఏరేస్తామన్నారు. మీడియా సంస్థలు, న్యూస్ ఛానెల్ ఆఫీస్ ల పై బిఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని, మేం దాడులకు పాల్పడితే ఊహించుకోలేరని హెచ్చరించారు.

Leave a Reply