200 మంది విద్యార్థుల‌కు వైద్యం…

200 మంది విద్యార్థుల‌కు వైద్యం…

చిట్యాల, ఆంధ్రప్రభ : దివిస్ లేబో రే టరీస్ లిమిటెడ్(Divis Labor Ray Tarries Limited) వారు విద్యార్థులకు హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినంద నియమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి అన్నారు. ఈరోజు మండలంలోని గుండ్రంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత హెల్త్ క్యాంపును దివిస్ యాజమాన్యం నిర్వహించారు.

హెల్త్ క్యాంప్(Health Camp) సందర్భంగా 200 మంది విద్యార్థులకు వైద్యులు జయంత్ కుమార్, నరేష్ లు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం మేరకు మందులను పంపిణీ చేశారు. నోట్ బుక్స్, బ్యాగ్స్, సైన్స్ ల్యాబ్(Note Books, Bags, Science Lab) పరిశోధన పరికరాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హేమలత, దివిస్ ప్రతినిధులు ఎస్ సాయి కృష్ణ, జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply