West Godavari | వివాహేత‌ర సంబంధం.. మ‌హిళ‌పై అమానుషం

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: పశ్చిమగోదావరి (West Godavari ) జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లు శివారు గుత్తులవారిపాలెం (guttulavaripalem)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ (woman) పై గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఆ మహిళను స్తంభానికి కట్టేసి చిత‌క‌కొట్టారు.. గ్రామానికి చెందిన సుబ్బారావు స్థానికురాలితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని అత్తిలిలో నివాసం ఉంటున్నాడు.

విషయం తెలిసిన సుబ్బారావు (Subbarao) భార్య వారిని రెడ్‌ హ్యాండెడ్‌‌గా పట్టుకుంది. ఆపై ఆ మ‌హిళ‌ను సుబ్బారావు భార్య, కుటుంబ సభ్యులు కలిసి గుత్తులవారిపాలానికి తీసుకునివచ్చారు. అక్క‌డ ఆమెను చెట్టుకు క‌ట్టేసి, వివ‌స్త్ర‌ను చేసి కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బాధిత మ‌హిళ‌ను విడిపించారు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మ‌హిళ‌ను కొట్టిన వారంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు.