HCA Scam | నిందితులకు రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) టిక్కెట్ల అక్రమాల కేసులో అరెస్టయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులకు మేడ్చెల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడి వాదనలను పరిశీలించిన కోర్టు, నిందితులను జ్యుడీషియల్ కస్టడీలోకి పంపుతూ తీర్పు వెలువరించింది. కొద్ది సేపట్లో వీరిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 సీజన్లో టిక్కెట్ల అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు తర్వాత CID అధికారులు జగన్మోహన్ రావు తదితరులను అరెస్ట్ చేశారు. కేసు సంబంధించిన మిగతా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
