శబ్ధం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే ఫత్తా క్షిపణి
1200కిలో మీటర్ల ఇజ్రాయెల్‌కు నాలుగు నిమిషాలలో చేరిక
ఏ వాయు రక్షణ వ్యవస్థ అడ్డుకోలేని సూపర్ సోనిక్ మిస్సైల్
ఇప్పటికే రెండు మిసైల్స్ ప్రయోగించిన ఇరాన్
ఈ మిసైల్ రాకతో కంగారు పడుతున్న ఇజ్రాయెల్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తెలిపిన వివరాల ప్రకారం.. “ఆపరేషన్ ఆనెస్ట్ ప్రామిస్ 3″లో భాగంగా 11వ దశ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హైపర్సోనిక్ క్షిపణి “ఫత్తా-1” ను ఉపయోగించినట్లు పేర్కొంది. “ఆక్రమిత భూభాగాల గగనతలంపై ఇరాన్ దళాలు పూర్తి నియంత్రణ సాధించాయి” అని ఐఆర్జీసీ ప్రకటించినట్లు సమాచారం. ప్రస్తుత ఘర్షణలో ఇరాన్ తొలిసారిగా ఈ తరహా క్షిపణిని ఉపయోగించింది. 2024 అక్టోబర్ 1వ తేదీన జరిగిన “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ II”లో కూడా ఇరాన్ ఫత్తా-1 క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది.
ఫత్తా-1 క్షిపణి ప్రత్యేకతలు ఇవే..
ఇరాన్ 2023లో తొలి హైపర్ సోనిక్ క్షిపణి ఫత్తా-1ను ఆవిష్కరించింది. దీనికి సుప్రీం లీడర్ ఖమేనీయే పేరు పెట్టారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, యారో వంటి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించేలా ఫత్తా-1ను రూపొందించినట్లు సమాచారం. దీన్ని “ఇజ్రాయెల్-స్ట్రైకర్”గా ఐఆర్జీసీ అభివర్ణిస్తోంది. ఈ క్షిపణి పొడవు 12 మీటర్లు కాగా, 1,400 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తూ, 200 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.
గాల్లోనే రూట్ చేంజ్ చేసే సత్తా..
ఫత్తా-1, గంటకు 17,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ) వార్‌హెడ్‌ను కలిగి ఉంది. గాలిలో ఉండగా తమ ప్రయాణ మార్గాన్ని మార్చుకోగల సామర్థ్యం ఈ హైపర్ సోనిక్ క్షిపణులకు ఉంటుంది. ఈ ప్రత్యేక సామర్థ్యం కారణంగా వీటిని గుర్తించి, అడ్డగించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. శబ్ద వేగం కన్నా ఐదు రెట్లు వేగంగా.. అంటే సుమారు గంటకు 6,100 కిలోమీటర్ల వేగంతో ఈ క్షిపణులు ప్రయాణిస్తాయి.