నథింగ్ కంపెనీ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘నథింగ్ ఫోన్ 3’ను జూలై 1న లండన్ లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ లాంచ్ ఈవెంట్‌ను YouTubeలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ లాంచ్ ద్వారా నథింగ్ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన స్థాయిని మరింత పెంచుకోనుంది.
నథింగ్ ఫోన్ 3 – ప్రధాన ఫీచర్లు
- డిస్ప్లే: 6.77-ఇంచుల LTPO AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
- ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్.
- మెమరీ & స్టోరేజ్: 12GB RAM + 256GB స్టోరేజ్ & 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లు.
- కెమెరా: 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా.
- బ్యాటరీ: 5,000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్.
- డిజైన్: ప్రముఖ గ్లిఫ్ ఇంటర్ఫేస్‌ను తొలగించి, డాట్-మాట్రిక్స్ స్టైల్ బ్యాక్ ప్యానెల్‌ను ప్రవేశపెట్టింది.
- ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారంగా నథింగ్ OS 3.0. వంటి ఆధునిక ఫీచర్లు, డిజైన్ వినియోగదారులను ఆకర్షించనున్నాయి.
ధర అంచనా..
నథింగ్ ఫోన్ 3 ధర సుమారు €800 (సుమారు ₹71,000) గా అంచనా వేయబడుతోంది. అమెరికా మార్కెట్లో $799 (సుమారు ₹66,000) ప్రారంభ ధరతో అందుబాటులో ఉండవచ్చని సమాచారం. భారత మార్కెట్లో కూడా ఈ ధర సమీపంలో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.