Bullion Market | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర ..

హైద‌రాబాద్ – దేశంలో నేడు బంగారం ధర పెరగ్గా, వెండి రేటు తగ్గింది. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.98,740 ఉండగా, శనివారం నాటికి రూ.500 పెరిగి రూ.99,240కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.1,00,690 ఉండగా, శనివారం నాటికి రూ.90 తగ్గి రూ.1,00,600కు చేరుకుంది.

హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.99,240గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,600గా ఉంది.
విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.99,240గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,600గా ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.99,240గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,600గా ఉంది.
ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.99,240గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,600గా ఉంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు పెరిగాయి. శుక్రవారం ఔన్స్‌ గోల్డ్ ధర 3,340 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 52 డాలర్లు పెరిగి 3,358కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 33.50 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.188గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *