వీకెండ్ ఎఫెక్ట్.. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..

ఆంధ్రప్రభ, శ్రీశైలం : శ్రీశైలానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్‌ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలిరావడంతో ఘాట్‌ రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దోమలపెంట (బ్రహ్మగిరి) నుంచి లింగాలగట్టు వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లింగాలగట్టు నుంచి శ్రీశైలం ప్రవేశ మార్గం వరకు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో భక్తులు గంటల తరబడి రహదారిపైనే చిక్కుకుపోయారు.