ఉత్తమ ఉద్యోగులుగా మంగపేటకు చెందిన ముగ్గురు

మంగపేట, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందజేసే ఉత్తమ ఉద్యోగి అవార్డులకు ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు ఎంపికయ్యారు. మంగపేట గ్రామపంచాయతీ కార్యదర్శి బోట సురేష్, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్, జీపీడీఓ గంపల నర్సయ్య అవార్డులు అందుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా వారు అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, జి. సంపత్‌రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీపీఓ కొండా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్న బోట సురేష్, శ్రావణ్, గంపల నర్సయ్యలను అధికారులు, ఉద్యోగులు, మండల ప్రజలు అభినందించారు.