పీహెచ్‌సీ వైద్యాధికారికి ఉత్తమ సేవా పురస్కారం

వికారాబాద్, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ సౌమ్యకు వైద్య, ఆరోగ్య విభాగంలో ఉత్తమ సేవా పురస్కారం లభించింది. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ డాక్టర్ సౌమ్యకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విధుల్లో అంకితభావంతో సేవలు అందించినందుకు ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రాహుల్ మహేశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.