వెంకటాపురంలో స్వాతంత్య్ర వేడుకలు
గాంధీ, నెహ్రూ విగ్రహాలకు ఘన నివాళులు
స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
వేంసూరు, ఆంధ్రప్రభ : వెంకటాపురం గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, గొర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ సర్పంచ్ పుల్లారెడ్డి, గొర్ల సుధాకర్‌రెడ్డి, చిలుకూరి సత్యనారాయణరెడ్డి, కొండ్రు కృష్ణారావు, వెదుళ్ల శ్రీను, సుబ్బారెడ్డి, శేషు, తిరుదల వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, చెన్నారెడ్డి, చెన్నయ్య, చల్లా భాస్కరరెడ్డి, ఏశు రవి, రామారావు, గణేష్‌కుమార్, కేశవరావు, పంది గంగాధర్, పంది బుజ్జోడు తదితరులు పాల్గొన్నారు.
