విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ల వితరణ
రూ.15 వేల విలువైన క్రీడా దుస్తులు అందజేసిన కొమ్ముల కిషన్
క్రీడా పోటీల విజేతలకు రూ.3 వేల విలువైన బహుమతులు
దాతలను సన్మానించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామానికి చెందిన కొమ్ముల కిషన్ సుమారు రూ.15 వేల విలువైన క్రీడా దుస్తులను శనివారం వితరణ చేశారు. అదేవిధంగా పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు మానవ హక్కుల కమిషన్ బోర్డు డైరెక్టర్ సామ కిషన్ సుమారు రూ.3 వేల విలువైన బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా దాతలు కొమ్ముల కిషన్, సామ కిషన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి, ఉపాధ్యాయ బృందం శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలే రావు రాజేశ్వర్, కమ్మర్పల్లి మండల మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు పాలెపు గంగారం తదితరులు పాల్గొన్నారు.
