నిరుపేదలకు సంక్షేమ ఫలాలు

కళాశాలలో మధ్యాహ్న భోజనం
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కరీంనగర్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలియజేసారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కళాశాలలో సైతం మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మనకొండుర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.