తహశీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తొర్రూరు రూరల్ (ఆంధ్రప్రభ): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరు తహశీల్దార్ కార్యాలయంలో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులు, సిబ్బందికి మిఠాయిలు అందజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్, ఆర్‌ఐలు, జీపీఓలు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.