ఘనంగా సాయి గౌడ్ జన్మదిన వేడుకలు..
- ఎంపీపీ చేతుల మీదుగా కేక్ కట్ – బీఆర్ఎస్ నేతల సన్మానం
రాయపర్తి, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రియ శిష్యుడు, రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన మండల పార్టీ నాయకుడు చిలువేరు సాయి గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శుక్రవారం బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి సాయి గౌడ్ తో కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ అనిమి రెడ్డి మాట్లాడుతూ… ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువతకు నాయకత్వం వహిస్తూ ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు.
సాయి గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాయపర్తి మాజీ సర్పంచ్ గారే నర్సయ్య, రాయపర్తి మాజీ ఎంపీటీసీ ఐత రామ్ చందర్, జయరాం తండా (K) సర్పంచ్ లావుడ్యా నరేష్, మండల పార్టీ నాయకులు ఆశ్రఫ్ పాషా, పోగులకొండ వేణు, ఐత కుమార్, కుక్కల భాస్కర్, సంకినేని ఎల్లస్వామి, బల్లెం యాదగిరి, ఐత రవి, ఉబ్బని మధు, గారే నరేష్, ఐత జంపి, దేదావత్ వినోద్, గుండె రాకేష్, ఐత రాకేష్, సతీష్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
