మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పున్నం రవి నియమాకం..

రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పున్నం రవిని నియమిస్తూ గురువారం పిసీసీ అధ్యక్షులు. మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పున్నం రవి మాట్లాడుతూ… తన ఎన్నికకు సహకరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్నాకర్ లకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచనలతో అందరినీ కలుపుకొనిపోతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు, కష్టపడి పని చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే జీఎస్సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.