వయో వృద్ధుల కమిటీ ఎన్నిక..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో సర్పంచ్ జూకంటి అనిల్ ఆధ్వర్యంలో గ్రామ వయోవృద్ధుల కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా దూసరి రమేష్,కార్యదర్శి గా దాసరి ఏసురుషి, కోశాధికారి గా నిమ్మల సుధాకర్ రెడ్డి, పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బొమ్మకంటి. లక్ష్మీనారాయణ, ఒగ్గు క్రిస్టోపర్, మండల సభ్యులు బండ్రు రాజమల్లయ్య, వల్లాల మధుసూదన్ తో పాటు గ్రామ వయోవృద్ధులు పాల్గొన్నారు.
