మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాళ్లపెళ్లి భాస్కర్ రావు

గణపురం, ఆంధ్రప్రభ : మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మండలంలోని పరిశరాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనీ జంగుపల్లి గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు తాళ్లపెళ్లి భాస్కర్ రావును ఎంపిక చేస్తూ గురువారం పిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తాళ్లపెళ్లి భాస్కర్ రావు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్నాకర్ లకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే జిఎస్ఆర్ సూచనలతో అందరినీ కలుపుకొనిపోతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన తాళ్ళపెళ్లి భాస్కర్ రావుకు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిని శివశంకర్ గౌడ్, పరుశురాంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పెంట రవీందర్, ఎర్రగోళ్ల రాజు,పలుకల విద్యాసాగర్ రెడ్డి, సర్పంచ్ లు కటుకూరి రాధిక శ్రీనివాస్,కావటి రజిత రవీందర్, కొత్త వెంకన్న, లక్కం రాములు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.