అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామాలలో బైకులు, ఆటోలలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని బిక్కనూర్ ఎస్సై అనిల్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ…. మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇట్టి విషయంలో రాత్రిపూట రైతులు వ్యవసాయ బావుల వద్ద కాపలాగా ఉండాలన్నారు. దొంగతనాల నివారణకు ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇట్టి విషయంలో ఆయా గ్రామాల సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన చెప్పారు.
