పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి..
- రామగుండం మేయర్ మహంకాళి స్వామి
- కార్మికులకు ఏకరూప దుస్తుల పంపిణీ
గోదావరిఖని, ఆంధ్రప్రభ : నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా , ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు గొప్పవి అని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తమ పాలక వర్గం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం నుండి వారికి అందవల్సిన ప్రయోజనాలను సకాలంలో వచ్చేటట్లు చూస్తామని స్పష్టం చేశారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి కష్టాలు ఎదురైనా తాము అండగా నిలుస్తామని ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి కార్మికులకు భరోసా ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరుతోనే నగరం ఎంతో పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఒక్కొకరికి రెండు జతల దుస్తులు, రెండు తువ్వాలలు సుమారు 400 మంది సిబ్బందికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్ , సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్ , జూనియర్ అసిస్టెంట్ చంద్రా రెడ్డి, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
