మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ సతీష్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పరీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని అవగాహన కల్పించారు. వాహనాల్లో గంజాయి తరలించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సీతాపాండు పాల్గొన్నారు.