ఉయ్యూరులో యువకుడి అదృశ్యం
ఉయ్యూరు, ఆంధ్రప్రభ: ఉయ్యూరుకు చెందిన 34 ఏళ్ల యువకుడు మరీదు బాలాజీ ఈశ్వరరావు గత ఐదు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న బాలాజీ ఈశ్వరరావు గ్లామర్ మోటార్‌సైకిల్‌పై బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పటి నుంచి ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కూడా బాలాజీ ఈశ్వరరావు కోసం గాలింపు చేపట్టారు.
బాలాజీ ఈశ్వరరావు ఆచూకీ తెలిసిన వారు లేదా ఆయనను ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే ఉయ్యూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం తెలిసిన వారు 97018 47102, 94406 27047, 94406 27047 సంప్రదించాలన్నారు.
