భీముడు తండాలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు

స్థానిక నాయకుడు సురేష్ నాయక్‌కు తండావాసుల కృతజ్ఞతలు

తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ: తొర్రూరు మండలం పెద్దదుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని భీముడు తండాలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక నాయకుడు జాటోత్ సురేష్ నాయక్ చొరవతో సోమవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.

హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీస్ సంస్థ సహకారంతో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. తండాలో రహదారి సౌకర్యం మెరుగుపడనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి సీసీ రోడ్డు నిర్మాణానికి సహకారం అందేలా కృషి చేసిన జాటోత్ సురేష్ నాయక్‌కు తండావాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దాతలు, సంస్థలు సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దుబ్బతండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాదావత్ అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాదావత్ లింబా, మాజీ వార్డు సభ్యుడు జాటోత్ శ్రీనివాస్, జాటోత్ జవహర్‌లాల్, జాటోత్ అమర్‌సింగ్, లక్పతి, రమేష్, వీరన్న తదితరులు, తండావాసులు పాల్గొన్నారు.