ఘనంగా ఎమ్మెల్యే కొలికపూడి జన్మదిన వేడుకలు..

ఎ.కొండూరు, ఆగస్టు 10 (ఆంధ్రప్రభ) : తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ… ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, రహదారులు, తాగునీరు,విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

అలాగే పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజానాయకుడిగా ఆయన సేవలు కొనసాగుతున్నాయన్నారు.రానున్న రోజుల్లో కూడా తిరువూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షిస్తూ,ఆయన ఆయురారోగ్యాలతో నిండు దీర్ఘాయుష్షుతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.