అసిఫా కుటుంబానికి డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా పరామర్శ..

(విజయవాడ, ఆంధ్రప్రభ) : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం కుమార్తె ఎండీ ఆసిఫా కుటుంబాన్ని రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా పరామర్శించారు.

విజయవాడలోని డీసీపీ షరీన్‌ బేగం నివాసానికి చేరుకున్న డీజీపీ.. ఆసిఫా భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ విషాద సమయంలో మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.