రాగినేడులో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్, మండల కన్వీనర్ ఇల్లందు అంజి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మేకల విజయ్‌కుమార్, బీజేపీ సీనియర్ నాయకుడు పొన్నం మధురయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తంగేడ రాజేశ్వర్‌రావు, తాళ్ల లక్ష్మణ్, మామిడి ఉమేష్, ముంజ రాజేంద్రప్రసాద్, పడాల నర్సయ్య, చింతపండు స్వామి, దండు చంద్రయ్య, గుంటుకు సది, మేడగొని శివయ్య, రెడ్ల వేణు, ముత్యం సాగర్, ముసారి రవి తదితరులు పాల్గొన్నారు.
