పేదల ఆరోగ్య భద్రతకు సీఎంఆర్‌ఎఫ్‌ అండ

82 మంది లబ్ధిదారులకు రూ.31.19 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

పర్చూరు, ఆంధ్రప్రభ: ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వారికి సకాలంలో ఆర్థిక సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

పర్చూరులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 82 మంది లబ్ధిదారులకు రూ.31,19,396 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తన సిఫార్సు ద్వారా మంజూరైన ఈ సాయంతో లబ్ధిదారులకు వైద్య ఖర్చుల విషయంలో కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని ఏలూరి సాంబశివరావు తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.