ప్రజల మధ్యకు వెళ్లిన ఎమ్మెల్యే.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం

నరసరావుపేట, ఆంధ్రప్రభ: ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం – అభివృద్ధి’ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి రాయపాడు మీదుగా వాగ్దేవి కళాశాల వరకు బస్సులో ప్రయాణించారు.

ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, ఇతర ప్రయాణికులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలకు అందుతున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరుపై వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు.

ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, వారి అభిప్రాయాలను స్వయంగా వినడం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.