వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 50 మంది చేరిక

  • ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో చేరికలు

పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు నల్లమోతు సురేష్ గారు, 50 మంది నాయకులు, కార్యకర్తలు పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి” కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి” కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.