Gurazala-Mla : నేనున్నాన‌నీ. Andhra Prabha Exclusive Story

Gurazala-Mla : నేనున్నాన‌నీ. Andhra Prabha Exclusive Story

  • జ‌నం కోసం ..జ‌నంతో..య‌ర‌ప‌తినేని .
  • 90 ఏళ్ల పేదోడికి అండ‌గా.
  • సొంత నిధుల‌తో ఆర్థిక సాయం.
  • బీటెక్ విద్యార్థినికి భ‌రోసా
  • ఇదీ గుర‌జాల ఎమ్మెల్యే నిబ‌ద్ధ‌త‌

( ఆంధ్ర‌ప్ర‌భ‌, గుర‌జాల)

కష్టనష్టాల్లోని గురజాల నియోజకవర్గ ప్రజలకు నేనున్నాన‌నీ య‌ర‌ప‌త‌నేని కేవ‌లం ఓదార్పే కాదు. త‌క్ష‌ణ స‌మ‌స్య స‌రిష్కారం కోసం ఎక్క‌డ రాజీ ప‌డ‌రు. ప‌రిస్థితిని బ‌ట్టి త‌న వ్య‌క్తిగ‌త సాయం అందింటంలో ఎక్క‌డ త‌గ్గేది లేద‌ని నిరూపిస్తుంటారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇదే విష‌యాన్ని మ‌రో సారి నిరూపించారు. 90 ఏళ్ల వృద్ధుడు.. త‌న కాయ‌క‌ష్టంతో త‌న మ‌న‌వ‌రాలికి గొప్ప ఇంజ‌నీరును చేయాల‌ని త‌పిస్తున్న త‌రుణంలో విధి వెక్కిరించింది. ఆర్థిక క‌ష్టాల‌ను పెంచింది. క‌డ‌కు త‌న మ‌న‌వ‌రాలి చ‌దువు అర్తంరంగా ఆగిపోయే స్థితిలో.. య‌ర‌ప‌తినేని మాన‌వ‌త్వం పై న‌మ్మ‌కంతో.. ఆయ‌న‌ను క‌లిసి.. త‌న బాధ‌ను వెళ్ల‌గ‌క్కే క్ర‌మంలో.. స‌భ్య స‌మాజం ఆశ్చ‌ర్య‌పోయే ఘ‌ట‌న చోటు చేసుకుంది,. అదేంటో త‌లుసుకుందాం.

Gurazala-Mla : అదొక హృద‌య విదారక ఘ‌ట‌న
..
రెండు రోజుల కిందట మాచవరం మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు 90 ఏళ్ల వయసులో, నడవలేని స్థితిలో చేతికర్ర సాయంతో, చిరిగిన చొక్కాతో బీసీ ముదిరాజు సామాజికవర్గానికి చెందిన పోతురాజు వెంకటేశ్వర్లు వ‌చ్చారు. “ఇది భూ సమస్యల కోసం జరుగుతున్న రెవెన్యూ సదస్సు… వ్యక్తిగత సమస్యల పై ఎమ్మెల్యేను కలవాలంటే ఆఫీసుకు వెళ్లాలి” అని అక్క‌డ కొంద‌రు వారించారు. “యరపతినేని ఎవరనుకుంటున్నారు..? ఆయన పేదల మనిషి… మా మనిషి… నేను ఆయన్ని ఇక్కడే కలవాలి” అంటూ అక్కడే ఆ పెద్దాయ‌న ఉండిపోయారు , ఈ విషయం దూరం నుండి గమనించిన యరపతినేని వెంటనే ఆయనను తన దగ్గరకు పిలిపించి, కుర్చీ వేయించి కూర్చోబెట్టి ఆప్యాయంగా సమస్యను అడిగి తెలుసుకున్నారు.

ఆGurazala-Mla : దీన గాథ ఇది

తల్లి మరణించడంతో, తండ్రి కూడా చిన్నారిని తాత వద్ద వదిలి వెళ్లిపోవడంతో మనవరాలు నాగమల్లేశ్వరి బాధ్యత మొత్తం వెంకటేశ్వర్లు మీద పడింది. తనకు ఉన్నంతలో మనవరాలిని చదివిస్తూ వచ్చిన ఆ తాతకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఆమె బీటెక్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మనవరాలి చదువు ఆగిపోకూడదనే ఒకే ఒక్క ఆశతో అర్జీ పట్టుకొని ఎమ్మెల్యే వద్దకు వచ్చారు. ఆ పెద్దాయన పరిస్థితిని, తనపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని చూసి యరపతినేని చ‌లించిపోయారు. “మీరు మళ్లీ ఎక్కడికీ రావాల్సిన అవసరం లేదు… మీ ఇంటికే నేనే స్వయంగా వస్తాను. అన్ని విషయాలు మాట్లాడి మీ కుటుంబానికి అండగా ఉంటాను” అని మాట ఇచ్చారు.

Gurazala-Mla : క‌దిలిన క‌రుణామ‌యుడు

ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు స్వయంగా మాచవరం మండలం గోవిందాపురంలోని వెంకటేశ్వర్లు ఇంటికి యరపతినేని శ్రీనివాసరావు వెళ్లారు నాగమల్లేశ్వరి బీటెక్ చదువుకు సంబంధించి రెండు , మూడు , నాలుగో సంవత్సరాల ఫీజు బకాయిలు మొత్తం కలిపి 3.17 లక్షలు అవుతాయని తెలుసుకున్నారు “ఆమె చదువు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగకూడదు. చదువు పూర్తయ్యే వరకు అయ్యే ఫీజు మొత్తాన్ని నేనే వ్యక్తిగతంగా భరిస్తాను. ఆమె భవిష్యత్తుకు అండగా ఉంటాను” అని భరోసా ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఏ విద్యార్థి చదువూ అర్ధాంతరంగా ఆగిపోకూడదనే మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో, నాగమల్లేశ్వరి చదువును కొనసాగించి మంచి భవిష్యత్తు అందుకునే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Gurazala-Mla : నేనున్నాను.. అంటూ..

పెద్దాయన కుటుంబ తక్షణ అవసరాలు, ఇంటి ఖర్చుల కోసం రూ.50,000 నగదు అందించడంతో పాటు, వెంకటేశ్వర్లు గారికి రెండు జతల కొత్త దుస్తులు కూడా అందించారు. మనవరాలి చదువుకు రూ. 3.17 లక్షలు కుటుంబానికి తక్షణ సాయం రూ.50 వేలు…మొత్తం రూ. 3.67 లక్షల వ్యక్తిగత ఆర్థిక భరోసాన్ని ఆ కుటుంబానికి అందించారుకానీ ఇక్కడ విలువ కేవలం ఆర్థిక సాయం ఎంత చేశారన్నది మాత్రమే కాదు. 90 ఏళ్ల ఒక పేద తాత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గౌర‌వించి తాను ఇచ్చిన మాట కోసం స్వయంగా అతని ఇంటి గడప తొక్కి ఆ కుటుంబానికి “నేనున్నాను” అంటూ భరోసా ఇవ్వడమే య‌ర‌ప‌త‌నేని అసలైన మానవత్వం అని నిరూపిత‌మైంది. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రజల కష్టం తన కష్టంగా భావిస్తూ, యోగక్షేమాలే తన బాధ్యతగా యరపతినేని శ్రీనివాసరావు ముందుకు సాగుతూ.. న‌వ‌త‌రం ప్ర‌జాప్ర‌తినిధుల‌కు స్పూర్తిగా నిలిచారు.