అథ్లెటిక్స్‌ కోచ్‌ శిక్షణకు ఉప్లూర్‌ యువతి ఎంపిక

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామానికి చెందిన సాదుల కావేరి అథ్లెటిక్స్‌ కోచ్‌ శిక్షణకు ఎంపికయ్యారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బీపీఈడీ పూర్తి చేసిన కావేరి ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో బెంగళూరులోని నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నెల 21వ తేదీ వరకు బెంగళూరులో శిక్షణ పొందనున్నారు. కోచ్‌ శిక్షణకు ఎంపికైన కావేరిని గ్రామస్తులు అభినందించారు.