కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి రాక..
- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన చైర్మన్ ఈవో
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఎంపీ దంపతులకు దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో శీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎంపీ కేశినేని చిన్ని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఎంపీ దంపతులకు అందజేశారు.

