నల్లబెల్లికి బయలుదేరిన కేసీఆర్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి నల్లబెల్లికి బయలుదేరారు. ఉద్యమకాల సహచరుడిగా, పార్టీలో నిబద్ధత కలిగిన అనుచరుడిగా, ఆత్మీయుడిగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్న సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు కేసీఆర్ నల్లబెల్లికి వెళ్తున్నారు.
కేసీఆర్ వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్ రాజు, శేరి సుభాష్‌రెడ్డి, క్రాంతికిరణ్ తదితరులు ఉన్నారు.
