దళిత మహిళలకు రక్షణ కరువైంది : దళిత నేతలు.

మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి నాగాయతిప్ప రోడ్డులో ఇటీవల ఓ ఎస్సీ యువతిని బిసి కులానికి చెందిన కె.సందీప్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో బెదిరించి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్ళి అమానుషంగా దాడి చేసిన విషయంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆ యువతికి న్యాయం చేసేందుకు దళిత సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మాలమహానాడు జిల్లా నేత దోవా గోవర్ధన్ మాట్లాడుతూ బాదిత మహిళకు న్యాయం జరగకపోతే ఉన్నతాదికారులకు పిర్యాదు చేసి ఆందోళన బాట పడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దళిత నేతలు బట్టు జైపాల్, బత్తుల బిక్షం, జి నాగశ్రీను, శ్యామ్, మద్దాల ధర్మారావు, రాకేష్, బొంతు ప్రకాష్, మేరుగు రణధీర్, గుంటూరు బాబురావు, బెజవాడ రవి, గుంటూరు కుటుంబ రావు, లింగం అనీల్, మద్దాల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.