బైక్‌ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి…

యువకుడికి తీవ్రగాయాలు..


యడ్లపాడు, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): బైక్‌ అదుపుతప్పడంతో రోడ్డుపై నుంచి పొలాల్లోకి వెళ్లి పడింది. దీంతో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ నాగిశెట్టి.సాంబయ్య కుమారుడు నాగిశెట్టి వెంకట రమేష్ 21 శనివారం తెల్లవారుజామన బోయపాలెం నుంచి బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్‌ పోల్స్, ఇనుప కంచెలను సైతం తెంచుకుని 15 మీటర్ల దూరంలో ఉన్న పొలాల్లో పడిపోయాడు.

ఈప్రమాదంలో యువకుడి కంటికి, చేతులకు తీవ్రంగా గాయపడ్డాడు. పొలం పనులకు వెళ్లున్న స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు,108 వాహనానికి సమాచారం అందించారు.దీంతో ఘటనా స్థలానికి చేరుకుని 108 యడ్లపాడు సిబ్బంది. పి.దేవదానం, పైలట్ ఎల్.రవితేజ గాయలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.