గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం

రేగొండ, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని చిన్నకోడపాక గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రేగొండ మండలం లింగాల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కనపర్తి గ్రామంలో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. రేపాక గ్రామంలో గ్రామపంచాయతీ, మహిళా సమైక్య నూతన భవనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి రేషన్‌ కార్డు లబ్ధిదారుడికి స్మార్ట్‌ కార్డు పంపిణీ చేయడంతో పాటు కొత్త ఆసరా పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో రేపాక గ్రామ సర్పంచ్ గుల్ల స్వప్న-తిరుపతి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శ్వేతారావు, మెడికల్ ఆఫీసర్ హిమబిందు, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, జిల్లా నాయకులు నాయినేని సంపత్‌రావు, నడిపెల్లి విజ్జన్‌రావు, మేకల బిక్షపతి, ఎర్రబెల్లి రవీందర్‌రావు, గంగుల రమణారెడ్డి, బానోతు రవీందర్, నాయకులు ఇప్పకాయల నర్సయ్య, పున్నం రవి, ముడుతనపల్లి శంకర్, కేసిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మొట్టే కిరణ్, తోకల సురేందర్‌రెడ్డి, మైస బిక్షపతి, నడిపెల్లి వెంకట్రావు, పొనుగోటి వీరబ్రహ్మం, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.