అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
ప్రజాదర్బారులో గద్దె రామమోహన్, గద్దె అనురాధ
పటమట, ఆంధ్రప్రభ: ప్రజలు చెబుతున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్, టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం నాడు తూర్పు శాసనసభ్యుని కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. శాసనసభ్యులు గద్దె రామమోహన్, టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు నుంచి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం శాసనసభ్యులు ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిత్యం తమ కార్యాలయం తెరిచే ఉంటుందని, రోజువారీ ప్రజలు తమ సమస్యలతో వస్తూంటారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం పనిచేస్తున్నామని చెప్పారు. కొన్ని సమస్యలు ప్రభుత్వం పరిధిలోనివని, ప్రజాదర్బారు రోజు అధికారులు కూడా ఉంటారని, ప్రజల సమస్యలను వారు నమోదు చేసుకొని ప్రభుత్వానికి విన్నవిస్తారని చెప్పారు. ప్రభుత్వం పథకాలను రూపొందించి, ప్రజలకు మరింతగా సంక్షేమం అందించడానికి ప్రజాదర్బారులు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, పొట్లూరి సాయిబాబు, మాజీ కార్పొరేటర్లు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, టిడిపికి చెందిన ఇతర ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
