Increased gold prices : పెరిగిన బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,890


Increased gold prices : ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత రెండు రోజులుగా గణనీయంగా పెరిగిన పసిడి ధరలు శుక్రవారం మాత్రం స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.

గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం… శుక్రవారం (ఆగస్టు 7) ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,890గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,400 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,420గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్ల ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.