విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతి
కొత్తపల్లి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పించాలని విజ్ఞప్తి
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సర్పంచ్ పెర్క రిబ్కా సంతోష్ ఆధ్వర్యంలో గ్రామ ప్రతినిధులు విద్యుత్ శాఖ ఏడీఈకి వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు, దెబ్బతిన్న, పొట్టిగా ఉన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాల ఏర్పాటు, తక్కువ వోల్టేజ్ సమస్య, ఏబీ స్విచ్ల లోపాలను పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల కారణంగా గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వినతిపై స్పందించిన ఏడీఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందేలా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.
