తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక జయశంకర్

ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.

తహశీల్దార్ సైదులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ చేసిన త్యాగాలు, ఉద్యమానికి అందించిన సిద్ధాంతపరమైన మార్గనిర్దేశం చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ భీష్వ, ఎన్నికల నాయబ్ తహశీల్దార్ పట్టాభి, మండల గిర్దావర్ శివకుమార్, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, గ్రామ పాలన అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆచార్య జయశంకర్ సేవలను స్మరించుకున్నారు.