ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం
భవానీపురం, ఆంధ్రప్రభ: విజయవాడలోని కేఎల్ రావు నగర్ లో అనారోగ్యంతో మరణించిన ఏసుపోగు సామ్యూల్ (40) కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బుధవారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో 47వ డివిజన్ కూటమి నేతలు, సుజనా మిత్రా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిరుపేద అయినటువంటి ఎసు పోగు సామ్యూల్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 47వ డివిజన్ కూటమి నేతలు సుజనా దృష్టికి తీసుకెళ్లగా ఈ మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 5000 సాయం అందజేశారు. 47వ డివిజన్ కూటమి నేతలు నాగోతి రామారావు, గౌరీ శంకర్, చొక్కర పాపారావు , సుజనా మిత్రా కోఆర్డినేటర్ దుర్గారావు పాల్గొన్నారు.
